శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్ లో ఉన్న విభావరి అపార్ట్ మెంట్స్ లో, MIG కాలనీలోని మహిళా మండలి కార్యాలయంలో, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని భారతి మహిళా మండలిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ” పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు” అని అన్నారు. ” ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. పోటీలలో విజేతల ఎంపికలో తాటిచర్ల వరలక్ష్మి, అనూషా జడ్జీలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాళ్ళు జ్యోతి, రాధారాణి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు B. N. రెడ్డి, రాజేష్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు, తెలుగు శాంతకుమార్, అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.