శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర పాంచ జన్య అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీస్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాఘవేంద్ర పాంచ జన్య అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు అభివృద్ధికి కృషి చేయాలని, ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర పాంచ జన్య అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్య ప్రకాష్, అసోసియేషన్ సభ్యులు విజయ సారథి, రవి, శరత్ బాబు, ప్రకాష్ , రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.