చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి కుమారుడితో సహా బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ మిశ్రా 8 ఏళ్ల కిందట బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి చందానగర్‌లోని ఇందిరానగర్‌లో భార్య రీతా దేవి (25) కుమారుడు రుద్ర ప్రకాష్ మిశ్రా (2)లతో కలిసి జీవిస్తూ స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కాగా రీతా దేవి తన భర్త రాహుల్‌కు చెప్పకుండా తన కుమారుడు రుద్ర ప్రకాష్‌ను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె ఎప్పుడు ఇంటి నుంచి వెళ్లిందో రాహుల్ కు తెలియలేదు. ఈ క్రమంలో అతను తన భార్య, కుమారుడుడ కనిపించకపోయేసరికి వారి కోసం చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద ఆచూకీ కోసం యత్నించాడు. అయినా ఫలితం లేకపోవడంతో రాహుల్ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.