కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలో మౌలిక వసతులైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు. గురువారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ బ్లాకులో రూ.22 లక్షల అంచనా వ్యయంతో బస్తీ దవాఖానా దగ్గర నూతనంగా చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి పరిశీలించారు. ప్రజల మౌలిక అవసరాలకు పెద్దపీట వేస్తూ, సరైన ప్రణాళికతో డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
ముందుగా అత్యవసరంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న రోడ్లను గుర్తించి త్వరిత గతిన వాటిని పూర్తి చెయ్యటానికి చర్యలు తీసుకోవటం జరుగుతుందని, అలాగే అన్ని అంతర్గత రోడ్లను కూడా త్వరితిగతిన పూర్తి చేస్తామన్నారు. రోడ్ల నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని కాంట్రాక్టర్ కు కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచించారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట వైస్ ప్రెసిడెంట్ గఫుర్, ఏరియా కమిటీ మెంబర్ హిమామ్, శ్రీకాంత్, శారద, హినాయత్, చక్రి, వంశీ మోహన్, మఖ్బుల్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, బస్తీ వాసులు పాల్గొన్నారు.