నాలాను పూడ్చి… పార్కింగ్ గా మార్చి…

గంగారం లోని ఎలిక హైలైఫ్ స్టూడియో ముందు నాలా పైకప్పు తొలగించి రిటైనింగ్ వాల్ ను ధ్వంసం చేస్తున్న దృశ్యం

-గంగారంలో ఎలిక హైలైఫ్ స్టూడియో నిర్వాహకుల బరితెగింపు

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు కొత్త వరద నీటి కాలువల నిర్మాణము, పాత కాలువల్లోని పూడికతీత కార్యక్రమాలు విరివిగా చేపడుతూనే ఉన్నారు. ఐనప్పటికి చిన్నపాటి వర్షానికే నగరంలోని రహదారులన్నీ ఏరులై పారుతున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి బల్దియా ఎప్పటి కప్పుడు అనేక రకాల చర్యలు చేపడుతూనె ఉంది. అయినా కొందరు ఆక్రమార్కుల చర్యలతో సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతుంది.

కాలువ కనుమరుగైతే వరద నీటి సమస్య జఠిలం…

చందానగర్ సర్కిల్ పరిధిలోని గంగారం ప్రధాన రహదారిని ఆనుకొని చాలాకాలం క్రితం నిర్మించిన వరద నీటి కాలువ ఉంది. కాగా స్థానిక హనుమాన్ దేవాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న “ఎలిక లైఫ్ స్టూడియో” షోరూం నిర్వాహకులు వరద నీటి కాలువ పైకప్పును ధ్వంసం చేసి, కాలువను పూర్తిగా మట్టితో మూసేస్తున్నారు. తమ షో రూమ్ కు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఆ స్థలాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే వర్షం పడినప్పుడు ప్రతిసారి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎలిక షోరూమ్ నిర్వాహకుల బరితెగింపు తో సమస్య మరింత జటిలమవవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే ఈ సమస్యను చందానగర్ సర్కిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఏఈ అనురాగ్ మహాదేవ్ అక్కడి సమస్యలను పరిశీలించి భాద్యులపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.

పైకప్పును తొలగించి వరదనీటి కాలువను పూర్తిగా మట్టితో నింపేసిన దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here