– నాలుగు చెరువుల్లో మొత్తం 1,45,200 చేప పిల్లలను వదిలిన గాంధీ
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ మీదికుంట చెరువు, నల్లగండ్ల పెద్ద చెరువు, నానక్ రాంగూడ గోపి చెరువు, దీప్తి శ్రీనగర్ రేగుల కుంట చెరువులలో 1,45,200 చేప పిల్లలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వదిలారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు ఒక వరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రంమలో భాగంగా నాలుగు చెరువులలో 1,45,200 చేప పిల్లలను వదలడం జరిగిందని, నల్లగండ్ల పెద్ద చెరువులో 60,000, మాదాపూర్ మీదికుంట చెరువు లో 22,500, నానక్ రాంగూడ గోపి చెరువులో 52,500, దీప్తి శ్రీనగర్ రేగుల కుంట చెరువులో 10,200 మొత్తం నాలుగు చెరువులలో 1,45,200 చేప పిల్లలను వదలడం జరిగిందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద పెరగడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని, మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని అన్నారు. నీలి విప్లవం సాధనలో భాగంగా నీలి తెలంగాణ సాధనకై ముందుకు అడుగులు వేయడానికి ఎంతగానో దోహదపడుతుందని, దానిలో భాగంగా ఉచిత చేపలు పంపిణీ చేసి మత్స్య కారులను ఆదుకుంటుందని, మత్స్య కారుల జీవితాల్లో వెలుగును నింపుతున్నారని, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.
మీదికుంట చెరువును దత్తత తీసుకుని తన సొంత నిధులతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి సుందరీకరించిన ఫౌంటెన్ హెడ్ స్కూల్ యాజమాన్యం మేఘన ముసునూరిని ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఎంతో మందికి ఆదర్శ ప్రాయురాలిగా నిలిచారని, ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని సామాజిక బాధ్యతగా చెరువులను పరిరక్షించాలని, చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, నియోజకవర్గంలోని అన్ని చెరువులను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారిణి సుకృతి, మియాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్, ఫౌంటెన్ హెడ్ స్కూల్ యాజమాన్యం మేఘన ముసునూరి, శ్రీధర్, మత్స్య కారులు మల్లేష్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.