నల్ల‌గండ్ల మార్కెట్‌లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి: కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కూరగాయల మార్కెట్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి‌ మార్కెట్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్ జోనల్ కమిషనర్ రవికిరణ్ ను కోరారు. ఈ మేరకు శనివారం‌ శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కలిసి వినతిపత్రం అందజేశారు.

జోనల్ కమిషనర్ రవికిరణ్ కు విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్

నల్లగండ్ల కూరగాయల‌ మార్కెట్ లోని షెడ్లు శిథిలావస్థకు చేరడంతో కూరగాయలు విక్రయించుకునే‌ వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాటి స్థానంలో‌ కొత్తగా పై కప్పులు వేయాలని, మరిన్ని నూతన షెడ్లను ఏర్పాటు‌ చేసేలా చూడాలన్నారు. మార్కెట్ లో మౌలిల వసతుల‌ కల్పనకు, అభివృద్ధికి‌ నిధులు మంజూరు చేయగలరని‌ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ‌జడ్ సీ రవికిరణ్ ను కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు దుర్గం జనార్థన్ గౌడ్, మైనారిటీ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here