మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ నుంచి గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రాఘవేందర్ రావు, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడు రవి కుమార్ యాదవ్ ల సమక్షంలో దాదాపుగా 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మోసపూరిత విధానాలను అవలంబించి డబ్బులతో ఇతర పార్టీ నాయకులను కొని గెలిచి గద్దెనెక్కారని, నైతికంగా భారతీయ జనతా పార్టీదే విజయమని ఎద్దేవా చేశారు. నాయకుడు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి బండి సంజయ్ నాయకత్వాన్ని బలపరచడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 2023లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కంకణబద్ధులై పార్టీలో చేరుతున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. కార్యకర్తలు అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం మనందరం కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకుడు మహేష్ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాజు శెట్టి, శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, సార రవీందర్ బాబు ముదిరాజ్, శ్రీనివాస్, శివరాజ్ ముదిరాజ్, సారా శ్రీనివాస్, జే రాము, మహేష్, శ్రీధర్, సోను కుమార్ యాదవ్, శివ, చక్రధర్, జోహార్ రెడ్డి, నరేష్ చారి, హరికృష్ణ, జి మల్లేష్ పాల్గొన్నారు.