ప్రతి కూడలిని సుందర శోభిత వనంగా తీర్చిదిద్దుతాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి జంక్షన్, నల్లగండ్ల తెల్లాపూర్ చౌరస్తా జంక్షన్ ల వద్ద చేపట్టిన సుందరికరించి, విద్యుత్తు వెలుగులతో అభివృద్ధి చేసిన కూడలిలను కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, గంగాధర్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి కూడలిని సుందర శోభిత వనంగా తీర్చిదిద్దుతామని, అభివృద్ధి చేసిన జంక్షన్లను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంద‌ని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అన్ని హంగులతో , సకల సౌకర్యాలతో కూడలిని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలు, వాహనదారులను, చూపరులను ఆకట్టుకునేలా అద్భుతంగా కూడలిలను తీర్చిద్దిద్దడం జరిగింది. చక్కటి స్వచ్చమైన ఆహ్లాదకరమైన పచ్చదనంతో కూడిన కూడళ్ల‌ను ఏర్పాటు చేయడం జరిగింద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here