శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ లో పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా, అందుకు సన్నాహకంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ కలయిక సమావేశం శేరిలింగంపల్లి సీనియర్ సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, వివేకానంద నగర్ కార్పొరేటర్ రోజాదేవి రంగా రావుల ఆధ్వర్యంలో మియాపూర్ లోని అతిధి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు నాయకులు ప్రతి ఒక్కరు హాజరై కార్యక్రమం విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిబాబా, రోజాదేవి మాట్లాడుతూ ఏప్రిల్ 27 న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రాజతోత్సవ సభను ప్రతి డివిజన్ నుండి ముఖ్య నాయకులు, ప్రతి కార్యకర్త సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మారబోయిన రవి యాదవ్, పురుషోత్తం యాదవ్, మిద్దెల మల్లా రెడ్డి, హరీష్ రావు, రవీందర్ యాదవ్, బాబు మోహన్ మల్లేష్, తిరుమల్లేష్, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, శేఖర్ గౌడ్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, రోజా, శ్రీనివాస్, బాబూమియా, జమీర్ సలీం, భద్రయ్య, సతీష్ రావు, అలాఉద్దీన్ పటేల్, రాములు, పెద్ద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.