శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): యుద్ధభూమిలో మేము సైతం పాల్గొంటామని ఆర్మీ అధికారులను కలిసి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ చర్చించారు. యుద్ధ భూమిలో ప్రత్యక్షంగా తాము పాల్గొని తమకు కేటాయించిన విధులను భారత దేశం ఆత్మగౌరవం కోసం మిలిటరీకి అండగా ఉంటూ యుద్ధం చేస్తామని, తమకు కేటాయించిన విధులను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మిలిటరీ అధికారులను కలిసి విన్నవించుకున్నారు. సికింద్రాబాద్ సబ్ ఏరియా ఆర్మీ హెడ్ క్వార్టర్ యాడం కమాండర్ ను బేరి రామచంద్ర యాదవ్ తోపాటు ఎక్స్ సర్వీస్మెన్ ఆర్డిలరీ ఆర్మీ రిటైర్డ్ మిలిటరీ జవాన్ ఆర్కే సాయన్న, సుదర్శన్ సింగ్ కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ సరిహద్దులో జరుగుతున్న సింధూర్ ఆపరేషన్ యుద్ధం మూడు రోజులు దాటిందని, యుద్ధంలో గాయపడ్డ వీర జవానులకు యువజన సంఘాల నుండి బ్లడ్ డొనేషన్ సేకరించి ఆర్మీ అధికారులకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇష్టపూర్వకంగా యుద్ధంలో తాము, యువత ప్రత్యక్షంగా పాల్గొని కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు.
మిలిటరీ అధికారులను కలిసిన వారిలో అందెల కుమార్ యాదవ్ , రిటైర్డ్ ఎస్ఐ నరసింహారావు, ఉపాధ్యక్షులు రాయుడు, సైదులు యాదవ్, మార్వాడి శంకర్, రజక సంఘం నాగేష్, నాయి బ్రాహ్మణ సంఘం కృష్ణ, షేక్ మొహమ్మద్, ప్రసాద్ యాదవ్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, యువజన నాయకులు, అభ్యర్థులు, అభిమానులు, కాలనీవాసులు అందరూ పాల్గొన్నారు.