శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు

శేరిలింగంప‌ల్లి, మే 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. సాత్విక రెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శనలో సరస్వతి స్తుతి, ఓంకారకారిని, పాదసేవనం అంశాలను ప్రదర్శించి మెప్పించారు. తరువాత శ్రావ్య బండారుశిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భజమానస విఘ్నేశ్వర , మహాగణపతిమ్, తిరు తిరు జవరాల , పరమపురుషుడు, చిన్ని శిశివు, ముద్దుగారే యశోద, నవరసములది నళినాక్షి, ఒకపరికొకపరి, మధురానగరిలో, రామ్ భజన, వగలాడి మాటలకు, దశావతర శబ్దం, మంగళం అంశాలను భవ్య, నిత్య, పవన్ శ్రీజ , అనైక, సహస్ర, ఝువనా, శ్రావ్య బండారు ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here