శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీ వాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎఫ్సీఐ కాలనీలో తలెత్తిన సమస్యలను స్వయంగా వెళ్లి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మెన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో తలెత్తిన డ్రైనేజీ, మంచినీటి కొరత, రోడ్ల సమస్యలను విడతల వారిగా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ, మంజీర మంచినీటి వసతులను మెరుగుపరుస్తామని, మియాపూర్ డివిజన్లో ప్రతి కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ గౌడ్, మియాపూర్ డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుప్రజ, ఎఫ్సీఐ కాలనీ వాసులు వెంకటేశ్వర్ రావు, హరి కృష్ణ, రాశిల్, రామకృష్ణ, జితేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






