శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతాప్ సింగారం గ్రామ పరిధిలో ఉన్న శ్రీ గుబ్బరి గుట్ట మైసమ్మ దేవాలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం గెస్ట్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టి. ఆర్. పి. ఎస్. రాష్ట్ర అధ్యక్షుడు డా వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఏరియా ప్రముఖ హాస్పిటల్ సౌజన్యంతో పేద ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రాథమిక చికిత్స చేయాలని, హద్దు మీరి పరిధి దాటి వైద్యం చేయవద్దని, పరిధిలో లోబడి ప్రజలకు రోజుకు 24 గంటలూ అందుబాటులో ఉండి రోగుల ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కు పంపాలని అన్నారు. ప్రాథమిక చికిత్స చేసి సలహాలు, సూచనలు, ఆరోగ్య అభిప్రాయాలు ఇవ్వాలని, శుభ్రత పరిశుభ్రత గురించి ప్రజలకు చైతన్యం కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు డా. జిపిఆర్, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ ఆర్గనైజర్స్ డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.






