న్యూ కాలనీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మే 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో నూతనంగా డ్రైనేజీ లైన్ల నిర్మాణం పనులు చేపట్టబోయే పరిసర ప్రాంతాలను, శ్రీరంగాపురం కాలనీలో త‌లెత్తిన డ్రైనేజీ సమస్యను జలమండలి DGM నారాయణ, CMC ఇంజినీరింగ్ విభాగం అధికారులు, న్యూ కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ సమస్యలను స్వయంగా వెళ్లి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మ‌న్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలలో తలెత్తిన డ్రైనేజీ, మంచినీటి కొరత, సమస్యలను విడతల వారీగా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ, మంజీర మంచినీటి వసతులను మెరుగుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు జగదీష్, లింగయ్య, స్థానిక నాయకులు, వెంకటేష్ గౌడ్, తిమ్మరాజు, నరేష్, శంకర్ నాయక్, జ్యోతి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here