సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంప‌ల్లి, మే 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా 41 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.15,37,500 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అంద‌జేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేనీ చంద్రకాంత్ రావు , చంద్రమోహన్ సాగర్, నవీన్ రెడ్డి, రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here