శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ.6 లక్షల అంచనా వ్యయంతో ( SDF FUNDS నిధులతో ) నిర్మించడానికి గాను నిధుల మంజూరు కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పంపిన మంజూరు పత్రాలను సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల సిబ్బందికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నిధులు మంజూరు కాగానే పాఠశాల ప్రహరీ గోడ ను త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని , శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బ్రిక్ శ్రీనివాస్, రాంచందర్, కావూరి అనిల్, ప్రధానోపాధ్యాయురాలు సరిత, ఉపాధ్యాయులు అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






