కేటీఆర్‌ను క‌లిసిన తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ మక్తా మహబూబ్ పేట్ 44 సర్వే నెంబర్ భూమిలో 2000వ సంవత్సరంలో త‌న‌తోపాటు 7 మంది కలిసి కొనుక్కున్న భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని GHMC లో ఫిర్యాదు చేసి, హైకోర్టులో పిటిషన్లు వేస్తుంటే త‌న‌పై అక్రమ దారులు మొత్తం పదిమంది దాడి చేశార‌ని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR , శేరిలింగంపల్లి ఇన్చార్జి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డిని కలిసి విన‌తి ప‌త్రం అందించారు. అనంత‌రం సంతోష్ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే , 108 డివిజ‌న్‌ కార్పొరేటర్ అనుచరులు 10 మంది కలిసి బొల్లారం రోడ్డు మక్తా బస్ స్టేషన్ పక్కన నిలబడి ఉన్న త‌న‌పై పోలీసుల ఎదుటే దాడికి పాల్ప‌డ్డార‌ని అన్నారు. ఈనెల 10వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు FIR నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నందున బిఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ వీరిపై చర్య తీసుకునే విధంగా చూడాలని కేటీఆర్‌ను కోరిన‌ట్లు తెలిపారు. ఇందుకు తక్షణమే స్పందించిన కేటీఆర్ లీగల్ సెల్ కి కేసు అప్ప‌గించార‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here