శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని చెరువుల అభివృద్ధి కోసం PAC ఛైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో CSR నిధులతో ది లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు సుందరీకరణలో భాగంగా స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా చేపట్టిన సుందరీకరణ, పునరుద్ధరణ పనులను, మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ పరిధిలోని గురునాధం చెరువు తరహా మిగతా చెరువుల పునరుద్ధరణతో దశ దిశ మారునని అన్నారు. చెరువులను సుజల జలంతో అపురూప దృశ్యకావ్యంగా ఆవిష్కృతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిగవాడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆనంద్ మల్లిగవాడ్, సభ్యులు రామ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.






