శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసంను పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలందరూ తమ భేద భావాలను మరిచి ఈ పండుగను అన్యోన్యంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సాంబశివరావు, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, ఖాదర్ ,కరీం, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.