శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలతో కార్యాలయ ప్రాంగణాన్ని అలంకరించగా, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్తో పాటు వివిధ విభాగాలకు చెందిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ ప్రత్యేకంగా హాజరై జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాకు గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అధికారులు, నాయకులు పిలుపునిచ్చారు.





