శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హఫీజ్‌పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెన్సిల్ కిట్లు, మిఠాయిలను పంపిణీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొని వారికి ప్రోత్సాహం అందించడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






