గౌతమినగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌతమినగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 15న జెండా వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. భారత ప్రధాని పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కాలనీలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో గౌతమినగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రసాద్, సెక్రటరీ శివ ప్రసాద్, అడ్వైజర్ సత్యనారాయణతోపాటు సంఘం సభ్యులు గాంధీ చౌదరి, నారాయణ, సాంబశివరావు, ప్రేమ్‌చంద్, యాదయ్య, రాజు, లక్ష్మీపతి, శ్యామ్, వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here