శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మదీనాగూడలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద, అలాగే మక్తా మహబూబ్‌పేట్ చౌరస్తాలో ఆయన జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల సుదీర్ఘ పోరాటాలు, లెక్కలేనన్ని ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తుచేశారు. దేశ విముక్తి కోసం పోరాడిన అమరవీరులందరికీ పాదాభివందనాలు సమర్పించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుండె దయానంద్, సురేష్ శంకరొళ్ల, గుండె లక్ష్మి, ప్రభు, విష్ణు, కుమార్, మురుగేశన్, ప్రవీణ్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






