శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, బిసి ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ మాట్లాడుతూ బీసీలు ఏకం కావడం పోరాటం చేసి బీసీలకు రాజ్యాధికారం సాధించడమే ముఖ్యం అని అన్నారు. 33 జిల్లాల ప్రజలను ఏకం చేసి ఐకమత్యంతో ఉద్యమం ఉధృతంగా చేద్దామని పిలుపునిచ్చారు. బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీల ఐకమత్యమే మనకు బలం, బీసీలు ఏకం కావాలి, ఐకమత్యంతో పోరాటం చేయాలని అన్నారు. అధికారం సాధించాలని అడుక్కుంటే మనకు అధికారం ఎవ్వరు ఇవ్వరని మన ఓట్లు మనం వేసుకొని అధికారం సాధిద్దాం అని పిలుపునిచ్చారు. 33 జిల్లాల్లో విస్తృతంగా బీసీ నాయకులు పర్యటించి అందరినీ ఏకం చేయడమే మన ధర్మపోరాటం అని అన్నారు. ఈ ధర్మ పోరాటంలో అంతిమ లక్ష్యం అధికారం సాధించడమే విజయం అని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
