శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అమృత ఆర్ట్స్ అకాడమీ గురువు సాయి గీత శిష్య బృందం కూచిపూడి నృత్య ఆద్యంతం అలరించింది. మూషిక వాహన, తాండవ నృత్యకారి, ఆనంద తాండవం, పలుకే బంగారమాయెనా , అష్టలక్ష్మి స్తోత్రం, శంకర శ్రీగిరి, స్వాగతం కృష్ణ, భామాకలాపం, కృష్ణ శబ్దం, సరస్వతి స్తుతి, అన్నయ్య కీర్తనలు, రామాయణ శబ్దం, భావములోన, నటేశ కౌతం, బృందావన నిలయే, మహాగణపతిమ్, జతిస్వరం మొదలైన అంశాలను శ్రీనిధి, నిత్య సంతోషి, కార్తీక, చక్రికా, రమిత, కీర్తన, వైష్ణవి, శ్రీజ, హర్షిని, తీక్షణ, రోషిని, శాన్విక, ఈషా, నిత్య సంతోషి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
