ఓటు హక్కును కాపాడుకోవాలి: షేక్ చాంద్ పాషా

శేరిలింగంపల్లి, జూలై 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఎస్‌ఐఆర్ (SIR) అప్లికేషన్‌ను తప్పనిసరిగా పూర్తి చేసి సంబంధిత బీఎల్‌ఓ (BLO)కు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ చాంద్ పాషా పిలుపునిచ్చారు. తాను ఎస్‌ఐఆర్ అప్లికేషన్ చేశాన‌ని, ప్ర‌జ‌లు చేశారా? అంటూ ఆయన చైతన్యపరిచారు. త‌న‌ ఒక్క ఓటుతో ఏమవుతుంది? అనే నిర్లక్ష్య భావన వద్దని, ఒక్క ఓటే దేశ భవిష్యత్తును మార్చగలిగే శక్తిని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవడంతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యతను నిర్వర్తించాలని షేక్ చాంద్ పాషా విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here