శేరిలింగంపల్లి, జూలై 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పూరీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజనను సంస్థ ప్రతినిధులు మంగళవారం ఆహ్వానించారు. మియాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోపరాజు శ్రీనివాసరావుతో కలిసి ఇస్కాన్ ప్రతినిధులు భక్త పద్మ మహరాజ్, శ్రీరాం ప్రభు, ఆనంద్ ప్రభులు సృజనకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొనాలని ఆమెకు వారు విజ్ఞప్తి చేశారు.






