శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్బంగా హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో , శేరిలింగంపల్లి అసెంబ్లీ హఫీజ్ పేట్ డివిజన్ ప్రకాశ్ నగర్, వినాయక్ నగర్ లలోని కూరగాయల మార్కెట్, బస్తీలలో కరపత్రాలను పంపిణీ చేశారు. మే 10న సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగసభలో పాల్గొనాలని కాలనీ వాసులను కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్, డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, డివిజన్ బీజేపీ నాయకుడు కృష్ణంరాజు, డివిజన్ బీజేపీ కార్యదర్శి సుబ్బారావు , బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీజేపీ నాయకులు బాలు , హరీష్ పాల్గొన్నారు.






