శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ జరగబోయే బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని శేరిలింగంపల్లి అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ కు రావాలని పిలునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, ప్రతి బస్తీ, ప్రతి అపార్ట్మెంట్ నుండి ప్రజలు భారీసంఖ్యలో పాల్గొని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా మే 10వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తుల్జాభవాని ఆలయం వద్ద నుండి మియాపూర్ న్యూ కాలనీ శివాలయం వరకు శేరిలింగంపల్లి అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి , శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బైక్ ర్యాలీ ఇంత ఘనంగా నిర్వహించిన శేరిలింగంపల్లి యువ మోర్చా నాయకులు, పదాధికారులు, కార్యకర్తలను అభినందించారు. భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా తెలంగాణకు రావడమే కాకుండా తెలంగాణ ప్రజలపై ప్రధానికి ఉన్న ప్రేమను చాటిచెప్పేందుకే సుమారు రూ.7,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా కేవలం వికసిత్ భారత్ – వికసిత్ తెలంగాణ లక్ష్యంగానే ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బైపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి , రాధాకృష్ణ యాదవ్ , ఎల్లేష్ , రామ్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, రాజు శెట్టి, వసంతి యాదవ్ , అర్జున్ , మల్లేష్ గౌడ్ , రాజేష్ , గణేష్, విష్ణు దత్, జితేందర్, రాము యాదవ్, నవీన్ రెడ్డి, మాన్యం యాదవ్, శ్రీనివాస్, రాము , ఆంజనేయులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.





