శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కి చెందిన చిర్రా సాంబయ్య అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.2,50,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జంగయ్య యాదవ్, కాశినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






