ప్ర‌జ‌ల‌కు మెరుగైన వ‌స‌తులు కల్పిస్తున్నాం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అన్ని కాల‌నీలు, బ‌స్తీల్లోనూ ప్ర‌జ‌ల‌కు మెరుగైన వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు కృషి చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. గురువారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ లో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లు శంకుస్థాపన చేశారు.

సీసీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో దాదాపు యూజీడీ, మంచినీటి పైపులైన్ పనులతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పాటుపడుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీల‌ సహకారంతో శేరిలింగంపల్లి డివిజన్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నట్లు తెలిపారు. తారానగర్ లో రూ. 40 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డుతో కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్య తీరనుందన్నారు.

ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్, పద్మారావు, వార్డు మెంబర్లు కవిత, శ్రీకళ, పొడుగు రాంబాబు, బస్తీ కమిటీ అధ్యక్షుడు జనార్థన్ గౌడ్, మైనార్టీ కమిటీ అధ్యక్షుడు సయ్యద్, నాయకులు గోవింద్ చారి, గోపీ, జనార్థన్ గౌడ్, పవన్, ప్రభాకర్, లింగం శ్రీనివాస్, ఖాసీం, మహేష్ తివారి,‌ గోపాల్, రమణ, శ్రీనివాస్ రెడ్డి, రవి, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here