అధికారులు చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రించాలి: కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప‌్ర‌జ‌ల‌కు మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంలో అధికారులు మ‌రింత చిత్త‌శుద్ధితో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ అన్నారు. గురువారం ఆయ‌న డివిజ‌న్ ప‌రిధిలోని పాపిరెడ్డి కాల‌నీలో పాద‌యాత్ర చేప‌ట్టారు. స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

పాపిరెడ్డి కాల‌నీలో స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్

కాల‌నీలో మంజీరా నీటి స‌రఫ‌రా స‌రిగ్గా లేద‌ని, నీరు స‌రిగ్గా రావ‌డం లేద‌ని, అధికారుల‌కు ఎన్నిసార్లు స‌మ‌స్య‌ను విన్న‌వించినా వారు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మ‌హిళ‌లు కార్పొరేట‌ర్ ఎదుట వాపోయారు. ఇందుకు స్పందించిన కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ.. వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి‌ కృషి చేస్తానన్నారు. ప్రధాన రహదారి గుండా‌‌ వేస్తున్న యూజీడీ పైపులైన్ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. కాలనీలో ప్రజలకు కావాల్సిన అన్ని వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు‌.

యూజీడీ పైప్‌లైన్ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్

కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌ వెంట వార్డు మెంబర్లు పొడుగు రాంబాబు, శ్రీకళ, నాయకులు బద్దం‌ కొండల్ రెడ్డి, డాక్టర్ కొమురయ్య, రమణ, లింగారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here