మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఎదురు చూస్తున్నారని పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. బుధవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్, వెంకటరమణ కాలనీ వాసులు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగల రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి రవికుమార్ యాదవ్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గోకుల్ ప్లాట్స్‌లో అభివృద్ది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని అన్నారు. తెరాస వచ్చిన తరువాత స్థానికంగా ఏ ఒక్క పనీ జరగలేదన్నారు. అధికారులతో కలిసి తెరాస నాయకులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, నాగరాజు, రఘు యాదవ్, కొండయ్య, వెంకటరామ రెడ్డి, కనకయ్య, కుమార్, అంజి, మహేష్, రాజేష్, తేజ, మల్లయ్య, రవి, శంకర్, నారాయణ, రమేష్, చెన్నకేశవ, అజయ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.