శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందని,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని హరిజన్ బస్తిలో నెలకొన్న సమస్యలపై స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బస్తీలో ఉన్న సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగేష్ నాయక్, నాయకులు రాజు, కృష్ణ, గోపాల్ నాయక్, శ్రీనివాస్, సందయ్య, చౌదరి యాదయ్య, గణేష్, యాదయ్య, ప్రభు, దర్శన్, కిట్టు, సుధాకర్, రామస్వామి, జగన్, వినయ్ కుమార్, ఎస్ రాజు, ఎస్ భిక్షపతి, నరేష్, కే.ప్రభు, కే.శ్రీకాంత్, హరి, విక్రమ్, సంజయ్, జాషువా, ధనరాజ్, వినోద్, రాజేష్, ప్రేమ్ కుమార్ యాదవ్, సురేష్, హరి తదితరులు పాల్గొన్నారు.