శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ రాంబాగ్ ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో నూతన లేబర్ సెల్ నియామకాలను చేపట్టారు. లేబర్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా నల్ల సంజీవ రెడ్డి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా సప్పిడి భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా గోకర్ల లక్ష్మీ నారాయణ, ఆయిల శ్రీధర్ గౌడ్‌లను నియమించి వీరికి ప్రకాష్ గౌడ్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శి ఆర్.సుజిత్ గాంధీ, ఐఎన్‌టీయూసీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.చంద్రయ్యగౌడ్, దుర్గా సింగ్, నబీ బాషా, వీరేందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.