శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల అభివృద్ధిలో భాగంగా రూ. 3 కోట్ల 12 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణము పనులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ , రాజీవ్ గృహకల్ప(RGK), నెహ్రు నగర్, సైబర్ మెడోస్ కాలనీలలో రూ.1 కోటి 43 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఆరెక పూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మౌలిక వసతులకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/12/13b-1024x473.jpg)