శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని అంగారా రెస్టారెంట్ ముందు గత కొన్ని రోజులుగా వాటర్ లీకేజీ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన అట్టేపల్లి రామప్రభు గురువారం ఉదయం సమస్య ఉన్న ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆయన.. వాటర్ లీకేజీ సమస్యను వెంటనే పరిష్కరించి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. సమస్యను పరిశీలించిన అధికారులు మరో 3–4 రోజుల్లో వాటర్ లీకేజీని పూర్తిగా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ముందుంటానని రామప్రభు తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.






