శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్ చెరు ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ లోని సాయి అనురాగ్ హాస్పిటల్ పక్కనే ఉన్న సర్జికేర్ షాపి అనే మెడికల్ గోడౌన్ లో ప్రమాదవశాత్తూ భారీగా మంటలు అంటుకున్నాయి.

రాత్రి 12 గంటల ప్రాంతంలో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. గోడౌన్ యజమాని శ్రీనివాస రావు అగ్ని ప్రమాదం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 1 కోటి రూపాయల విలువైన మెడికల్ ఎక్విప్మెంట్, సర్జికేర్ ఐటమ్స్ దగ్ధం అయినట్టు తెలిపారు. బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






