గోపనపల్లి తండాలో మట్టి డంపింగ్‌పై స్థానికుల ఆందోళన.. రేపు మీడియా సమావేశం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో నివాస ప్రాంతాలకు సమీపంలో పెద్ద ఎత్తున మట్టి డంపింగ్ చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో డంపింగ్ చేసిన మట్టి కారణంగా వరద నీరు ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మట్టి డంపింగ్ యార్డును వెంటనే తొలగించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మార్వో, హైడ్రా, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు. ప్రజలకు సంబంధించిన సమస్య కావడంతో కార్యక్రమానికి హాజరై సమస్యను వెలుగులోకి తీసుకురావాలని నిర్వాహకులు కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here