మాదాపూర్‌లో కార్డులు ఆడుతున్న 10 మంది అరెస్ట్.. రూ.28,450 నగదు స్వాధీనం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లో నగదు పందాలతో కార్డులు ఆడుతున్న 10 మందిని మాదాపూర్ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.28,450 నగదు, 40 ప్యాకెట్ల ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని సిద్ధివినాయక నగర్‌లో ఉన్న మూన్‌స్టోన్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లోని గది నంబర్ 203లో కొందరు నగదు పందాలు కాస్తూ కార్డులు ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మాదాపూర్ పోలీసులు, ఎస్‌ఓటీ సిబ్బంది కలిసి అక్కడ దాడి నిర్వహించారు.

ఈ దాడిలో 10 మంది మూడు కార్డుల ఆటను నగదు పందాలతో ఆడుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిలో చింతపల్లి అజయ్ కుమార్ ఈ జూద కార్యకలాపాలను నిర్వహిస్తున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు సోదాలు నిర్వహించి రూ.28,450 నగదు, 40 ప్యాకెట్ల ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జూద కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా వాటిని నిర్వహించేందుకు సహకరించవద్దని మాదాపూర్ పోలీసులు ప్రజలకు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here