చందానగర్‌లో గంజాయి రవాణా.. ఇద్దరు అరెస్ట్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా, విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పాలిథిన్ కవర్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. 29 సెప్టెంబర్ న అందిన విశ్వసనీయ సమాచారంతో చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ సమయంలో పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.

అరెస్టయిన వారిని మెరిపాటి మనోజ్ కుమార్ (22), తండ్రి రాంబాబు, ప్రైవేట్ ఉద్యోగి, విశాఖపట్నం నివాసిగా, ఎం. ఆశా జ్యోతి (23), తండ్రి దేవుడు, ప్రైవేట్ ఉద్యోగి, విజయనగరం జిల్లా నివాసిగా పోలీసులు గుర్తించారు. విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా తేలిందని, ఒడిశాలోని కుందులి ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై NDPS Act, 1985లోని సెక్షన్ 8(c) r/w 20(b)(ii)(B) కింద కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి నమూనాలను FSL పరీక్షలకు పంపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here