శేరిలింగంపల్లి, నవంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ బిసి సంఘాలు ఏకమై ఆయనకు మద్దతుగా ఎర్ర గడ్డ డివిజన్ లోని నేతాజీ నగర్ లో ప్రచారం నిర్వహించారు. యువకుడు, విద్యావంతుడు, సుమారు ఇరవై సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ప్రజలకి సుపరిచితుడు అయిన నవీన్ యాదవ్ గెలుపు కోసం బిసిలు అంతా ఏకమై తమ ఓటును హస్తం గుర్తుకి వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ నవీన్ యాదవ్కు ఓటు వేయాలని అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రామకృష్ణ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి డబ్బు కొట్టు హరిబాబు యాదవ్, పాములేటి యాదవ్, గొర్రెల మేకల పెంపకం దార్ల సహకార సంఘాల వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, సినిమా ఆర్టిస్ట్ లక్ష్మినారాయణ యాదవ్, బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.





