శేరిలింగంపల్లి, నవంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. కొండాపూర్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలోని రామాలయం వద్ద నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీకాంత్ యాదవ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన రవికుమార్ యాదవ్ ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామిని దీక్షతో కొలవడం ద్వారా ఆపదలు తొలగి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయన్నారు. శరణంటూ ఆశ్రయించిన వారిని కాపాడే దైవం హరిహరసుతుడు అయ్యప్ప అని అన్నారు. స్వామి వారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 41 రోజులు మండలం పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎన్నో నియమాలతో ఈ దీక్షను నిర్వర్తిస్తారని అన్నారు. ఈ దీక్ష వల్ల స్వామి వారి కృపా కటాక్షాలు అందరిపై ఉంటాయన్నారు.






