శేరిలింగంపల్లి, నవంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డులో ఉన్న సెవెన్ హిల్స్ దేవాలయంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, అయ్యప్ప స్వాములకు అన్నదానం కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, EO సత్యనారాయణతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






