అభివృద్ధిని చూసి ఓటు వేయండి : జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్‌ ‌‌‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ మద్దతుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేట‌ర్‌ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కల్చరల్ క్లబ్ లో పార్టీ దిశా నిర్దేశాలు, పురోగతిపై ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి పూజిత గౌడ్ లతో పాటు స్థానిక డివిజన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్య సమావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. 60 ఏండ్ల చరిత్రలో టీఆర్ఎస్ పార్టీకి దీటుగా మ‌రే పార్టీ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని అన్నారు. మాదాపూర్ డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందని, మరోసారి అవకాశం ఇస్తే రెట్టింపు అభివృద్ధి చేసి చూపుతాన‌న్నారు. పార్టీలో పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు తగిన గౌరవం అందుతుందని, ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.

స‌మావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, హ‌ఫీజ్‌పేట‌, మాదాపూర్ డివిజ‌న్ల తెరాస అభ్య‌ర్థులు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here