టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు: కడియం శ్రీహరి

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తో కలిసి డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, తండాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సాయిబాబ ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్దించారు.

టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని డివిజన్ ప్రజలను అభ్యర్దిస్తున్న కొమిరిశెట్టి సాయిబాబ

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సంతృప్తి చెందిన ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో గచ్చిబౌలి టిఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో తొలిసారి పోటీ చేసిన సాయిబాబను భారీ మెజార్టీతో గెలిపించారని ఈఎన్నికల్లో సైతం అత్యధిక మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.

టిఆర్ఎస్ అభ్యర్థి సాయిబాబ, కడియం శ్రీహరి హారతి ఇస్తున్న డివిజన్ ప్రజాలు

అనంతరం సాయిబాబ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చానని అన్నారు. మరోసారి కార్పొరేటర్ గా డివిజన్ ప్రజలకు సేవచేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రాజు నాయక్, వార్డ్ మెంబెర్ అంజమ్మ, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here