శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుకట్‌పల్లి నియోజకవర్గంలోని ముస్కీపేట (మూసాపేట)లో వేడుకలు ఉల్లాసభరితంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ర్యాలీ, గోపూజ, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ దేశం, హిందుత్వం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. హిందూ సమాజం మేల్కొని తమకు వ్యతిరేకంగా ఉన్న శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని హిందూ సమాజాన్ని కాపాడుకునేందుకు వీరులుగా, శక్తిమంతులుగా మారి పోరాడాలని ఆయన సూచించారు. సమావేశం, ఇతర కార్యక్రమాల అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్కీపేట నుంచి ప్రారంభమైన ర్యాలీ కూకట్‌పల్లి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





