శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): గోకుల్ ప్లాట్స్‌లోని శ్రీ సాయి హిల్స్ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి PAC చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై, మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులు, కాలనీ వాసులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, చౌదరి, అనిల్ తోపాటు కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.





