శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ బాగ్ అమీర్ లోని లాల్బదూర్ ప్రాథమిక పాఠశాలలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు విద్యకల్పన ఏకాంత్ గౌడ్, నియోజకవర్గం నాయకుడు ఏకాంత్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులతో కలసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గం నాయకుడు గణేష్ గౌడ్, నియోజకవర్గం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి యస్. పి. జీతేందర్, ఎలక్టడ్ యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ ఉప్పల శృతి గౌడ్, నియోజకవర్గం ఎలక్టడ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుష్పేందర్, నాయకులు బొట్టు శ్రీను, షాలిని, నాగమణి తదితరులు పాల్గొన్నరు.